ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం హర్షణీయం : హోం మంత్రి

by Shyam |
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం హర్షణీయం : హోం మంత్రి
X

దిశ, క్రైమ్ బ్యూరో: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) 15వ వార్షికోత్సవ వేడుకలు హెటెక్స్ లో శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో చాలా మందికి సహాయం చేయడానికి ఎస్సీఎస్సీ ముందుకొచ్చిందని అన్నారు. శాంతి, అభివృద్ది రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయన్నారు. డీజీపీ మాట్లాడుతూ సెక్యూరిటీ కౌన్సిల్స్ ను హైదరాబాద్ నగరంలో మాదిరిగానే జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, భరణి పాల్గొన్నారు.

Advertisement

Next Story