పీఆర్సీ విషయంలో ఆందోళన వద్దు: మహమూద్ అలీ

by Shyam |
పీఆర్సీ విషయంలో ఆందోళన వద్దు: మహమూద్ అలీ
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి గృహకల్ప ఆవరణలో టీఎన్జీవోల 2021 సంవత్సర డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ… ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ అమలు ప్రకటన త్వరలో అందుతుందని అన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను త్వరలో రాష్ట్రానికి తీసుకు వస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed