- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత హాకీ ఒలింపిక్ జట్టులో ఎనిమిది మంది అరంగేట్రం
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళా హాకీ జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. మొత్తం పదహారు మందితో కూడిన ఈ జట్టులో 8 మంది తొలిసారిగా ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తున్న ఆటగాళ్లే ఉన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడిన 8 మంది సీనియర్లతో పాటు మరో 8 మంది యువ ప్లేయర్లను హాకీ ఇండియా ఎంపిక చేసింది. స్టార్ స్ట్రైకర్ రాణీ రాంపాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు హాకీ ఇండియా పేర్కొన్నది. భారత జట్టులో తొలి సారిగా మీజోరాంకు చెందిన ప్లేయర్‌కు చోటు దక్కింది. లాల్‌రెమ్‌సియామి భారత జాతీయ మహిళా హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.
పూర్తి జట్టు :
సవిత (గోల్ కీపర్), దీప్ గ్రేస్ఎక్కా, నిక్కి ప్రధాన్, గుర్జిత్ కౌర్, ఉదిత, నిషా, నేహ, సుశీల చాను, మోనిక, నవజోత్ కౌర్, సలీమ టేటే, రాణి రాంపాల్, నవనీత్ కౌర్, లాల్‌రెమ్‌సియామి, వందన కటారియా, షర్మిలా దేవి