ఆ ఖరీదు ప్రాంతంలో HMDA ప్లాన్ ఏంటి?

by Shyam |
ఆ ఖరీదు ప్రాంతంలో HMDA ప్లాన్ ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కోకాపేట్…! ఈ పేరు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే కోకాపేట చుట్టూర భారీ పథకాలను తీసుకొచ్చేందుకు HMDA సన్నాహాలు చేస్తుంది. 105 ఎకరాల్లో భారీ లేఅవుట్‎ను ఏర్పాటు చేసింది. ప్లాట్లకు ఆన్‎లైన్ వేలం నిర్వహించే సమయానికి కరోనా వచ్చిపడింది. దీంతో అథారిటీ తాత్కాలికంగా వేలాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు మరో రెండు భారీ పథకాలకు ప్రణాళికలను సిద్దం చేస్తుంది.

ఈ పాటికే ఔటర్ రింగ్ రోడ్‌లో పూర్తిగా LED విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నది. దీనికి తోడు ORR(ఔటర్ రింగ్‌ రోడ్డు) నుంచి నేరుగా కోకాపేట్ లేఅవుట్‎లోకి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా రోడ్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. లేఅవుట్, రోడ్డు నిర్మాణం మొత్తం రూ. 300 కోట్లు అంచనా వ్యయంగా అథారిటీ నిర్ణయించింది. ఈ నెలలోనే 13 లేదా 14వ తేదీన రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన మంత్రి కేటీఆర్ ద్వారా చేయనున్నట్టు సమాచారం.

రాబోతున్న పథకాలు:
కోకాపేట్‌లో ప్రత్యేకంగా రహదారులు, టౌన్ షిప్‌లు, మెట్రో రైలు, బిఆర్ టిఎస్ వంటివి రానున్నాయి. అథారిటీ ఇప్పటికే తగు ప్రణాళికలను రెడీ చేసింది. రోడ్ల వెంట ఆధునిక సైనేజ్‎లు, రోడ్ మార్కింగ్‎లను చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి వయా కోకాపేట్ మీదుగా ప్రత్యేకంగా మెట్రో రైలు మార్గం ప్రతిపాదించడం జరిగింది. రూ. 1,600 కోట్లు అంచనా వ్యయంగా ప్రతిపాదన ఉన్నది. ఈ ప్రతిపాదనకు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ అనుమతి కూడా లభించింది.

దీనికి తోడుగా HMDA మరో 100 ఎకరాల్లో భారీ లేఅవుట్‎కు ప్లాన్ చేస్తున్నది. వాస్తవానికి కోకాపేట్‎లో అథారిటీకి చెందిన భూమి 536 ఎకరాలు ఉన్నది. వీటిలో 72 ఎకరాలు గతంతోనే వేలం ద్వారా విక్రయించింది. ప్రస్తుతం 105 ఎకరాలు, అనంతరం ఆ భూమినంతా ప్రత్యేక మోడల్ టౌన్‎షిప్‎ను TOD(Transit Oriented Development) తరహాలోనే నిర్మించాలని భావిస్తున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ORR(ఔటర్ రింగ్ రోడ్డు) సర్వీసు రోడ్డును మరింతగా అభివృద్ది చేయాలని అథారిటీ నిర్ణయించింది.

536 ఎకరాల్లో టౌన్‎షిప్:
అథారిటీకి చెందిన 536 ఎకరాల్లో అత్యాధునిక టౌన్‎షిప్‎ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వ్యాపార, వాణిజ్యం, విద్యా, వైద్యం, సాంకేతిక వ్యవస్థ, రవాణా, కృత్రిమ చెరువులు, క్రీడామైదానాలు, ఓపెన్ థియేటర్లు, రెస్టారెంట్లు ఇలా నవీన జీవన విధానానికి అద్దం పట్టే విధంగా టౌన్‎షిప్‎ను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. గతంలో కోల్‌కతా విమానాశ్రయానికి చేరువగా ఉన్న న్యూ టౌన్ షిప్ తరహాలోనే ఈ కోకాపేట్ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed