ఆ రంగం మద్దతుతో పెరుగుతోన్న నియామకాలు

by Harish |
ఆ రంగం మద్దతుతో పెరుగుతోన్న నియామకాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ అంతరాయాల నుంచి వ్యాపారాలు పుంజుకోవడంతో దేశీయంగా నియామక కార్యకలాపాలు పెరిగాయని ప్రముఖ ఉద్యోగ కల్పన సైట్ నౌక్రీ తెలిపింది. ముఖ్యంగా ఈ నియామకాల పెరుగుదల ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో అధికంగా ఉన్నాయని నౌక్రీ హైరింగ్ ఔట్‌లుక్ నివేదిక వెల్లడించింది. తాజా నౌక్రీ అధ్యయనం ప్రకారం.. 51 శాతం మంది తమ సంస్థలలో కొత్త,రీప్లేస్‌మెంట్ నియామకాలను చేపడుతున్నట్టు చెప్పారు. 32 శాతం మంది కొత్త ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నట్టు ధృవీకరించాయి. డిజిటల్ సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఐటీ విభాగంలో డిమాండ్ ఎక్కువగా ఉందని, 50 శాతం మంది కంపెనీలు ఈ విభాగంలోనే ఎక్కువ నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే, మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధిలో కీలమైన ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. 38 శాతం మంది ఈ విభాగంలో నియామకాలు చేపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రంగాల్లో ఉద్యోగ భద్రత దెబ్బతిన్నది. అయితే, గతేడాది ఉద్యోగాల తొలగింపును 36 శాతం మంది కంపెనీల యజమానులు మద్ధతివ్వగా, తాజా అధ్యయనంలో 1 శాతం మంది మాత్రమే తొలగింపులకు మద్ధతిచ్చారు. ‘ఎక్కువమంది కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను పెంచే విషయంలో సానుకూలంగా ఉన్నారు. దేశీయంగా వ్యాపారాలు వేద్ధి సాధిస్తున్న తీరుకు ఇది నిదర్శనం. ముఖ్యంగా రాబోయే నెలల్లో ఐటీ రంగం ఈ నియామకాలలో కీలకంగా వ్యవహరించనున్నట్టు నౌక్రీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed