కక్కలేక మింగలేక.. ‘హిప్పో’ నోట్లో ప్లాస్టిక్ బాటిల్.. సీసీ ఫుటేజీలో సంచలన విషయాలు

by vinod kumar |
కక్కలేక మింగలేక.. ‘హిప్పో’ నోట్లో ప్లాస్టిక్ బాటిల్.. సీసీ ఫుటేజీలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వన్య మృగాల జాబితాలో హిప్పోపొటామస్ ఒకటి. వేగంగా మార్పు చెందుతున్న వాతావరణ పరిస్థితులే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హిప్పో లాంటి అరుదైన జాతులను కాపాడుకునేందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. హిప్పో జన్మస్థానమైన ఆఫ్రికాలో వేటగాళ్ల కారణంగా చాలా వరకు కనుమరుగు దశకు చేరుకున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. హిప్పో నోటిలోని దంతాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. దాని మాంసం, చర్మం కోసం వేటగాళ్లు నీటిలోని అడుగు భాగం నుంచి వేటాడుతున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆఫ్రికాలో హిప్పో జాతులను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వేటగాళ్ల నుంచి వాటిని రక్షించలేకపోతున్నారనేది కాదనలేని వాస్తవం.

ప్రపంచ వ్యాప్తంగా మానవ సంచారం పెరిగిపోవడంతో ఆవాసాల కోసం అటవీ విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. దీంతో వన్య ప్రాణుల మనుగడకు అనువైన స్థలం లేకపోవడం, సరైన ఆహారం లభించక చాలా జంతువులు ప్రాణాలు కనుమరుగు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా హిప్పోలకు నీరు అంటే చాలా ఇష్టం.. అవి ఎక్కువ సమయం నీటిలోనే ఉండేందుకు ఇష్టపడుతుంటాయి. అందుకే వీటిని ‘వాటర్ లవర్ యానిమల్స్’ అంటుంటారు. సరైన నీటి లభ్యత లేకపోవడం కూడా వీటి మనుగడకు ప్రాణాంతకంలా మారుతున్నాయి. అయితే, కొందరు తెలిసి తెలియక వన్య ప్రాణులతో ప్రవర్తించే విధానంతోనూ మూగజీవాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే ఇండోనేషియాలోని సఫారి పార్కులో ఆలస్యంగా వెలుగు చూసింది.

సఫారి పార్కులోని వన్యప్రాణులను చూసేందుకు ఎప్పటిలాగే సందర్శకులు వచ్చారు. హిప్పోపొటామస్ వద్ద చాలా మంది గుమ్మిగూడి ఫొటోలు దిగుతున్నారు. ఆ సమయంలో హిప్పో నోరు తెరవగా ఓ సందర్శకురాలు తన చేతిలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌ను దాని నోట్లోకి విసిరింది. అది సరిగ్గా హిప్పో గొంతులో అడ్డంగా ఇరుక్కుపోయింది. ఆ తర్వాత హిప్పో ప్లాస్టిక్ బాటిల్‌ను కక్కలేక మింగలేక తీవ్ర ఇబ్బందులు పడింది. గమనించిన పార్కు సిబ్బంది దానిని పరీక్షించారు. దాని నోట్లో ప్లాస్టిక్ బాటిల్ వ్యర్థాన్ని గుర్తించారు. ఇది హిప్పో నోట్లోకి ఎలా వచ్చిందని అధికారులు ఎంక్వైరీ చేపట్టారు. అందులో భాగంగానే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిచంగా మహిళ చేసిన దారుణం వెలుగు చూసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న సఫారి పార్కు యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన పనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed