‘విగ్రహాలు కాదు.. సిమెంటు బొమ్మలు’

by Shyam |
‘విగ్రహాలు కాదు.. సిమెంటు బొమ్మలు’
X

దిశ, ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు, రోడ్ల విస్తరణలో భాగంగా మెట్లదారి వద్ద ఉన్న లక్ష్మి నరసింహస్వామి, ఇతర దేవతల విగ్రహాలను, ఆర్చి గేటును ఐటీడీఏ అధికారులు రెండు రోజుల క్రితం తొలగించారు. దీనిపై ఈవో గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు మాట్లాడుతూ.. అవి దేవతా విగ్రహాలు కావని కేవలం సిమెంట్‌తో చేసి బొమ్మలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రధానార్చకులు దేవతల విగ్రహాలను కాపాడాల్సిన వ్యక్తి.. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడితే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ రోడ్డు విస్తరణలో భాగంగా చెక్ పోస్టుకు సమీపంలోని విశ్వక్సేన ఆలయాన్ని కూల్చివేయడానికి ఆలయ ప్రధాన అర్చకులే కారణమని ఆరోపించారు. అవి విగ్రహాలు కానప్పుడు వాటికి పూజలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈవో సైతం ఆ వ్యాఖ్యలను సమర్థించడంపై హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed