- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరు నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
దిశ, వెబ్‌డెస్క్: రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏప్రిల్‌లో మూడు నెలల కనిష్ఠంతో 4.29 శాతానికి పరిమితమైన రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) మేలో 6.3 శాతానికి పెరిగినట్టు సోమవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్‌బీఐ లక్ష్యం(+/-2) కంటే అధికంగా ఉన్నాయి. ఈసారి ఐదు నెలల తర్వాత తొలిసారిగా ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ పెరగడమే దీనికి కారణమని కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వివరించింది.
సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణ 5.01 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాల్లో నూనె ధరలు గణనీయంగా 30.84 శాతం పెరగడం గమనార్హం. అలాగే, గుడ్ల ధరలు 15.16 శాతం, మాంసం, చేపలు 9.03 శాతం, తృణ ధాన్యాలు 9.39 శాతం, పండ్ల ధరలు 11.98 శాతం పెరిగాయి. ఇంధన ధరల విభాగం 11.58 శాతం, దుస్తులు, పాదరక్షల ధరలు 5.32 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 1.92 శాతం తగ్గాయి.