ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్?

by Shyam |   ( Updated:2020-12-03 09:46:29.0  )
ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్?
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నగరంలో రాజకీయ పార్టీలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్క మలక్ పేట్ మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల గుర్తుల్లో తేడాలు రావడంతో మలక్ పేట డివిజన్ లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. వాయిదా పడిన డివిజన్లో డిసెంబర్-3న పోలింగ్ ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. చెప్పినట్లు గానే గురువారం మలక్‌‌పేటలో రీపోలింగ్‌ కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంది.

తాజాగా ఘాన్సీ బజార్, పురానాపూల్‌ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కమలం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. కాగా, అంతకుముందే ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్ విషయమై ఎన్నికల కమిషనర్ పార్థసారథిని బీజేపీ నేతలు కలిసి విన్నవించారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

Advertisement

Next Story