విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం

by Anukaran |   ( Updated:2021-01-08 05:11:02.0  )
విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ సాగర తీరంలో రింగు వలల వివాదం నెలకొంది. పెద్దజాలరిపేట, ఎండాడ జాలరిపేట, ఉప్పాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రింగు వలల వివాదంలో రెండు వర్గాలు పర్సరం దాడులు చేసుకున్నాయి. రింగు వలలతో వేటాడుతున్న మత్స్యకారులను మరో వర్గం అడ్డుకుంది. రింగు వలలను మరో వర్గం మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార మహిళ సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రింగు వలల అనుమతితో ఉపాధి కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రింగు వలల వివాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. సముద్రతీరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనే రింగు వలలు ఉపయోగించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం చేపల వేట సాగించే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై పోలీసులతో మాట్లాడతానని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed