బీజేపీ ఆఫీసు వద్ద పోలీసుల మోహరింపు

by Shyam |
బీజేపీ ఆఫీసు వద్ద పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ భవన్, ప్రగతి భవన్, డీజీపీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి బీజేపీ కార్యాలయంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మకాం వేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆఫీసు వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకుల కదలికలను గమనిస్తున్న పోలీసులు పలువురు నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ‎హైదరాబాద్‎లో విధ్వంసానికి బీజేపీ వ్యూహరచన అంటూ టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు.

Advertisement

Next Story