90 శాతం భారత్‌లో హై పాజిటివిటీ రేటు

by Shamantha N |
90 శాతం భారత్‌లో హై పాజిటివిటీ రేటు
X

న్యూఢిల్లీ: సుమారు 90 శాతం భారత్‌లో కరోనా హై పాజిటివిటీ రేటు ఉన్నట్టు కేంద్రం మంగళవారం తెలిపింది. 734లకు గాను 640 జిల్లాల్లో దేశ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపింది. గ్రామాల్లో పరిస్థితులపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా చైన్ బ్రేక్ చేయాల్సిన అవసరం గురించి, గ్రామిణా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి గురించి రాష్ట్రాలకు జాగ్రత్తలను కేంద్రం మంగళవారం సూచించింది. ‘కొత్తగా హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో హై పాజిటివిటీ రేట్ కనిపిస్తోంది. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కరోనా చైన్‌ను బ్రేక్ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి’ అని కేంద్రం ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి లవ్ అగర్వాల్ తెలిపారు.

కాగా గ్రామీణ భారతంపై ప్రత్యేకమైన దృష్టిని సారించి టెస్టింగ్ నిబంధనల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సవరణలు చేసింది. ప్రస్తుత కరోనా విజృంభణ నేపథ్యంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల మీద దృష్టి పెట్టడం కన్నా విరివిగా రాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలనీ.. తద్వారా కరోనా కేసులను వేగంగా గుర్తించి కరోనా చైన్ బ్రేక్ చేయడంపై దృష్టి సారించాలనీ ఐసీఎంఆర్ తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed