దేశానికి కరోనా రాజధానిగా.. ఢిల్లీ

by Shamantha N |
దేశానికి కరోనా రాజధానిగా.. ఢిల్లీ
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు ఇలాగే పెరుగుతూపోతే ఢిల్లీ దేశానికి కరోనా రాజధానిగా మారుతుందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం క్రమబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సుబ్రమణియం ప్రసాద్‌ల ధర్మాసనం పేర్కొంది. పౌరుల ప్రాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహించింది. ఈ అంశాలను సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా యోధులకు జీతాలివ్వడం లేదని దాఖలైన పలుపిటిషన్లను విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Next Story