- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేటీఆర్‌కు ఉపశమనం..
దిశ, న్యూస్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌కు రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం లభించింది. జన్‌వాడ ఫాంహౌజ్ విషయంలో ఎన్‌జీటీ కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. 111 జీవోకు విరుద్ధంగా ఫాంహౌజ్ నిర్మాణం జరిగిందని ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్‌జీటీ కోర్టు విచారణ జరిపి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫాంహౌజ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడ జరిగిన నిర్మాణాలతో సైతం ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొని రేవంత్ రెడ్డి రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా ఎన్‌జీటీని ఆశ్రయించారని పేర్కొన్నారు. ఎన్‌జీటీ సైతం నిజానిజాలను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో ఎన్‌జీటీ వేర్వేరు కేసుల్లో వెలువరించిన ఉత్తర్వులను ఉటంకిస్తూ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఆ పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర హైకోర్టు ఎన్‌జీటీ వెలువరించిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ కేటీఆర్‌కు ఉపశమనం కలిగించింది. కేటీఆర్ లేవనెత్తిన అంశాలతో ఏకీభవించిన హైకోర్టు ఎన్‌జీటీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.