- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖాదీ భూములపై ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు..
దిశ, కరీంనగర్ సిటీ : ఖాదీ భూముల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. చడీచప్పుడు లేకుండా విక్రయించడం పట్ల కోర్టు మొట్టికాయలు వేసింది. ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా వేలం వేయటాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. భూములకు బాధ్యులుగా ఉన్న వారి ఇష్టారాజ్యం పట్ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఆ భూముల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని, నిర్మాణాలు చేపట్టకూడదని సూచిస్తూ స్టే విధించింది.
ఆరు మాసాల కిందట ఉమ్మడి జిల్లాలోని మల్యాల మండలం పూడూర్ గ్రామంలో మెట్‌పల్లి ఖాదీ బోర్డుకు గల భూములు బోర్డు పాలకవర్గం ప్రైవేట్ వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా అమ్మింది. దీనిని సవాల్ చేస్తూ చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జి మేడిపల్లి సత్యం కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై శుక్రవారం విచారించిన ధర్మాసనం అమ్మకాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చొప్పదండి, మెట్‌పల్లి నియోజకవర్గాల్లోని అధికార నేతలు, భూ కొనుగోలు దారుల్లో నిరాశ, నిస్పృహలు అలుము కోగా, ఆయా సెగ్మెంట్లలోని కాంగ్రెస్ శ్రేణుల్లో అధికార నేతల అక్రమాలు అడ్డుకున్నామనే ఉత్సాహం కనిపిస్తుంది.