- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. చర్యలు తీసుకునే వరకు వైరస్ వేచిచూస్తుందా.? : హైకోర్టు ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని వివరణ కోరగా.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్) హైకోర్టుకు నివేదించారు.
ఈ విషయమై హైకోర్టు స్పందిస్తూ.. ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదు కదా.. ఇప్పటికే కరోనాతో అనేక మంది చనిపోయారు. ప్రభుత్వాలు కొన్ని చేస్తున్నప్పటికీ.. మరింత చేయాల్సిన అవసరం ఉంది. గత అనుభవాలతో నష్టాన్ని నివారించాలి. హైకోర్టు ఆదేశించినా.. కనీసం నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించలేదు. తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో డీహెచ్, కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.