ఓకే.. సచివాలయం కూల్చేయొచ్చు: హైకోర్టు

by Anukaran |   ( Updated:2020-06-29 01:00:27.0  )
ఓకే.. సచివాలయం కూల్చేయొచ్చు: హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని భావించిన ప్రభుత్వం గత ఏడాది జూన్ చివరి వారంలో కొత్త సచివాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని కూల్చివేయొద్దంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లను స్వీకరించిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. గత మార్చి నెల 10న తీర్పును రిజర్వ్ చేసి నేడు తుది తీర్పును వెల్లడించింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవొచ్చంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed