AP News: జగన్ సర్కార్‌కు షాక్.. ఆ జీవోపై హైకోర్టు స్టే

by srinivas |   ( Updated:2021-09-13 04:14:39.0  )
AP News: జగన్ సర్కార్‌కు షాక్.. ఆ జీవోపై హైకోర్టు స్టే
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతికి భూములిచ్చిన రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా భూముల లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వం భూసమీకరణ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవోపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజధానికి భూముల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 41ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం 316 జీవోను విడుదల చేసింది. ఈ జీవోపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు సోమవారం ఈ పిటిషన్‌పై విచారించింది. గతంలో అమల్లో ఉన్న జీవో ఆధారంగానే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం కూడా గుర్తించిందని.. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ స్థలాలు, పొలాలుల తమవి కావని రద్దు చేయడం అంటే అన్యాయం చేయడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పలువురు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed