"రాష్ట్ర ఖజానాకు నష్టం" హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

by srinivas |
రాష్ట్ర ఖజానాకు నష్టం హైకోర్టు కీలక వ్యాఖ్యలు 
X

ఏపీ రాజధాని తరలింపు అంశంలో దాఖలైన పిటిషన్లపై హై కోర్టులో విచారణ జరిగింది. త్రిసభ్య కమిటీతో ఏర్పాటైన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవాది మురళీధర్ సీఆర్డీఏ రికార్డులను కోర్టుకు సమర్పించారు. ఇప్పటివరకు 52 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఉన్న సీఆర్డీఏ రికార్డులను పరిశీలించిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

నేటి వరకు ఎంత ఖర్చు చేసారు? నిర్మాణాలు ఎక్కడి నిలిచిపోయాయి? ఎన్ని బిల్డింగులు పూర్తయ్యాయి? ఎక్కడ ఆగిపోయాయి? 52 వేల కోట్ల ప్రాజెక్టు ఏ దశలో ఉన్నాయి? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బు ఇవ్వాలి? తదితర అంశాలతో కూడిన వివరాలను వెంటనే సంపర్పించాలని ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ఉపయోగించుకోకపోతే అవి పాడైపోతాయని పేర్కొంది. ఈ నష్టాన్ని ఎవరు భరించాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది ప్రజల సొమ్ము, దీనిని నష్టపరిస్తే రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఆగష్టు 14న ఉంటుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed