- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టపాసులు పేల్చొద్దు : హైకోర్టు
దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలను నిషేధించాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తెరిచిన దుకాణాలను వెంటనే మూసివేయాలని, విక్రయాలు జరిపినట్లయితే దుకాణాదారులపై కేసులు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బాణసంచా వినియోగంపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రజలకు చైతన్యం కలిగించేలా ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కలిగించాలని సూచించింది. అమ్మకుండా దుకాణాలకు, కొనకుండా ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బాణసంచా వినియోగం ద్వారా శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయని, ప్రజల అనారోగ్యానికి కారణమవుతుందని న్యాయవాది ఇంద్రప్రకాష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాణసంచా కాల్చడంపైనా, విక్రయాలపైనా నిషేధం విధించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను గురువారం విచారించి విక్రయాలను నిషేధించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే దుకాణాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసి విక్రయాలు జరగకుండా చూడాలని, ఒకవేళ అక్రమంగా విక్రయిస్తున్నట్లయితే కేసులను నమోదు చేయాలని స్పష్టం చేసింది.
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై పిటిషనర్ లేవనెత్తిన వాదనలతో బెంచ్ ఏకీభవించింది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, పశ్చిమబెంగాల్, సిక్కిం తదితర ఎనిమిది రాష్ట్రాలు నిషేధించాయని, కోల్‌కతా నగరంలో వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నిషేధం విధించాల్సి వచ్చిందని పిటిషనర్ గుర్తుచేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది లేవనెత్తిన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం కూడా నిషేధించాలని ఆదేశించింది. క్రాకర్స్ కాల్చడంపైనా హైకోర్టు నిషేధాన్ని విధించినట్లు పిటిషనర్ ఇంద్రప్రకాష్ మీడియాకు వివరించారు. నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకున్నదో సమగ్రమైన నివేదికను హైకోర్టుకు ఈనెల 19వ తేదీన సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.