- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూలై 1 నుంచి విద్యార్ధులు స్కూల్స్‌కు రావాల్సిందేనా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పాజిటివ్ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిన కారణంగా తెలంగాణలో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జూలై1వ తేదీ నుంచి విద్యాసంస్థలను కూడా ఓపెన్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే విద్యాసంస్థల ఓపెన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించగా.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఆన్‌లైన్ క్లాసులు కూడా కొనసాగుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
అయితే.. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం ఎంత వరకు సాధ్యమవతుందని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందిస్తామని సుల్తానియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.