- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
దిశ, న్యూస్‌బ్యూరో: మెడికల్, దంత వైద్య పీజీ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని హైకోర్టు విచారణ చేపట్టింది. ‘ఏ’ కేటగిరీ విద్యార్థులు యాభై శాతం, ‘బి’ కేటగిరీ విద్యార్థులు 60 శాతం చొప్పున ఫీజు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని ఆదేశించింది. ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు మాత్రం పూర్తి ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇవి మధ్యంతర ఉత్తర్వులే కనుక విద్యార్థులు చేస్తున్న ఫీజు చెల్లింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ఫీజు రెగ్యులేటరీ కమిటీకి, వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా సంక్షోభం సమయంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమేనని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.