హైకోర్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరోషాక్

by srinivas |
హైకోర్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరోషాక్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకులు మీద షాకులిస్తోంది. నిన్నటికి నిన్న ఏపీలో ప్రాధమిక విద్యలో ఇంగ్లిష్ మీడియంను తప్పని సరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 81, 85ను రద్దు చేస్తూ తీర్పునివ్వగా.. తాజాగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై ఝలక్ ఇచ్చింది.

పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులను తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గడువిచ్చేందుకు సిద్ధమేనని చెప్పిన న్యాయస్థానం అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా? అని మెలిక పెట్టింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది.. లాక్‌డౌన్ నడుస్తోందని, రంగులేయడానికి సమయం పడుతుందని వివరించగా, దానిపై మండిపడింది. దీంతో రంగుల వేతకు సమయంపై సోమవారం వివరిస్తామని తెలిపింది.

దానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్సీపీ రంగును వేయించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలకు ఏపార్టీని సూచించే రంగులు ఉండకూడదని గతంలో న్యాయస్థానం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంచాయతీ రంగులు రాజకీయ రంగును పులుముకున్నాయి.

Tags: high court, ysrcp government, colors, panchayat office

Advertisement

Next Story

Most Viewed