కేంద్రం తీరుపై హైకోర్టు సీరియస్.. ప్రజలను చంపేస్తారా.?

by Shamantha N |
కేంద్రం తీరుపై హైకోర్టు సీరియస్.. ప్రజలను చంపేస్తారా.?
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో కరోనా రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్లకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ కూడా ఆసుపత్రుల్లో లభించని పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీకి ఇవ్వాల్సిన పూర్తి స్థాయి ఆక్సిజన్ కోటా 480 మిలియన్ మెట్రిక్ టన్నులను తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించింది. సరిపడా ఆక్సిజన్ లేకపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది.

ఆక్సిజన్ సరఫరా అంశాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని హెచ్చరించింది. తమ ఆదేశాలను పాటించకపోతే క్రిమినల్ చర్యలను చేపడతామని హెచ్చరించింది. ఆక్సిజన్ ట్యాంకర్లకు పూర్తి భద్రత కల్పించాలని, మార్గమధ్యంలో ఆ వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed