- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల బదిలీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. సర్కార్‌కు నోటీసులు జారీ
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నూతన జోనల్ విధానంలో భాగంగా స్థానికతకు అనుగుణంగా బదిలీలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయి కేడర్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరించింది. అయితే, ఈ బదిలీల ద్వారా తమకు అన్యాయం జరుగుతోందంటూ 226 మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు, గతంలో కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ఉన్నాయని బదిలీలపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరగా.. ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.