- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుదోవ పట్టిస్తే ఎలా? టీఎస్ఐఐసీకి హైకోర్టు అక్షింతలు
దిశ, తెలంగాణ బ్యూరో: బాధ్యతతో వ్యవహరించాల్సిన ప్రభుత్వ విభాగం ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రవర్తించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దిష్టంగా కొన్ని ప్లాట్లకు చెందిన భూములను వేలం వేయడం లేదని చెప్తూనే.. మరోవైపు నోటిఫికేషన్‌లో మాత్రం ఎలాంటి మినహాయింపు, గమనిక పెట్టకుండా అన్నింటితో కలిపి నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. రాజేంద్రనగర్ పరిధిలోని పుప్పాలగూడలో మూడు సర్వే నెంబర్లలోని ప్లాట్లను ఈ నెల 28న వేలం వేయడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 30వ తేదీన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే 301 సర్వే నెంబర్‌లోని ఐదు ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
లక్ష్మీ ఇంజనీరింగ్ అ,డ్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్,ను మంగళవారం విచారించిన బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. కాందిశీకుల నుంచి తాము ఈ భూములను కొనుగోలు చేశామని, సర్వే నెంబర్ 301లోని ఐదు ప్లాట్లు (నెం. 25, 26, 28, 29, 30) ఆ పరిధిలోకి వస్తాయని, వీటిని వేలం వేయడానికి వీలు లేదని పిటిషన్‌లో పేర్కొన్నది. ఈ అంశాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున పేర్కొన్న భూములను వేలం వేయడం లేదని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. కానీ నోటిఫికేషన్‌లో మాత్రం సర్వే నెంబర్ 301న ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఐదు ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించింది.
- Tags
- Highcourt