- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ్ముడిని లాలిస్తున్న యష్ కూతురు.. వీడియో వైరల్
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ యాక్టర్ యష్.. త్వరలోనే కేజీఎఫ్ సెకండ్ పార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన పర్సనల్ లైఫ్ విషయాలను యష్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయన సతీమణి రాధికాపండిట్ సైతం పిల్లల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటారు. కూతురు ‘అయిరా’ ఆటలు, మాటలు అన్నింటిని పోస్ట్ చేసే రాధికా.. ఇప్పుడు అయిరా తన తమ్ముడిని ఆడిస్తున్న వీడియోను షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుష్ చేసింది. తనదైన స్టైల్‌లో జోలపాట పాడుతూ తమ్ముడిని లాలిస్తున్న ముద్దులొలికించే అయిరా తన తండ్రిని ఇమిటేట్ చేస్తుందని చెప్తోంది. కాగా ఈ క్యూటెస్ట్ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు.. క్యూట్ ఏంజిల్స్‌ను చూసి తరించిపోయామని చెబుతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన అర్ధగంటలోనే 60 వేల లైక్‌లు రావడం విశేషం. ఇక బేబీ అయిరా డిసెంబర్ 2018లో జన్మించగా.. అక్టోబర్ 2019లో వీరికి అబ్బాయి పుట్టాడు.
https://www.instagram.com/p/CA644oogEU_/?utm_source=ig_web_copy_link
ప్రస్తుతానికి యష్.. కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అక్టోబర్ 23న విడుదల కానుంది.