కొవిడ్ రూల్స్ పాటించాల్సిందే : సాయితేజ్

by Shyam |
కొవిడ్ రూల్స్ పాటించాల్సిందే : సాయితేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి ఎంటరైన నాటి నుంచి అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో సినిమా థియేటర్లన్నీ క్లోజ్ అయ్యాయి. పరిశ్రమకు ఎంతో నష్టం జరిగింది. అన్ లాక్‌లో పలు రాష్ట్రాల్లో 50 % ఆక్యుపెన్సీతో టాకీస్‌లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో శుక్రవారం నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి.

ప్రేక్షకులు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని థియేటర్లకు వస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని హీరో సాయిధరమ్ తేజ్ చెబుతున్నాడు. ఆయన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ కొవిడ్ క్రైసిస్ తర్వాత రిలీజవుతున్న అతి పెద్ద సినిమాగా రికార్డులకెక్కబోతోంది. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రజలలో విశ్వాసం పెంపొందించడానికి సుప్రీం హీరో సాయి ధరం తేజ్ థియేటర్లను సందర్శించడంపై ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేశారు.

శుక్రవారం ఆయన హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌ను సందర్శించాడు. మాస్కులు హ్యాండ్ శానిటైజర్ లతో థియేటర్లకు రావడం పూర్తిగా సురక్షితం అని ప్రజలకు సూచించాడు. థియేటర్‌లో సినిమా చూడటానికి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆనందంగా చూడొచ్చని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి తేజ్ సరసన నభా నటేష్ నాయికగా నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed