హీరో రామ్ ఇంట విషాదం.. హృదయం ముక్కలయ్యిదంటూ ట్వీట్

by Shyam |   ( Updated:2021-05-18 02:07:41.0  )
హీరో రామ్ ఇంట విషాదం.. హృదయం ముక్కలయ్యిదంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య ఈరోజు ఉదయం మృతిచెందారు. ఈ విషయాన్ని రామ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన తాతయ్య ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “తాతయ్య .. మీరు విజయవాడలో ఒక లారీ డ్రైవర్ గా పనిచేస్తూ, లారీ టైర్ల కింద నిద్రపోయారు. మీ కుటుంబ‌స‌భ్యులకు అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించ‌డానికి మీరు ఇలాంటి ఎన్నోత్యాగాలు చేశారు. డ‌బ్బు ఉంటేనే ధ‌న‌వుంతులు కార‌నీ… మంచి మ‌న‌సు ఉన్న వారే నిజ‌మైన శ్రీమంతులు అని మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీరే.. మీరు లేర‌న్న వార్త న‌న్ను ఎంతో బాధిస్తోంది. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed