- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే కంపార్ట్‌మెంట్స్ మాదిరిగానే థియేటర్లోనూ.. జగన్ సర్కార్‌పై హీరో నిఖిల్ రియాక్షన్
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య వార్ నడుస్తోంది. అటు సినీ నటులు ఇటు మంత్రుల విమర్శలతో వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా ఈ టికెట్ల రేట్లపై హీరో నిఖిల్ స్పందించారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన మద్దతు ఇస్తుందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అన్నీ వర్గాల ప్రేక్షకులకు అందుబాటు ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ప్రతీ థియేటర్‌లోనూ రూ.20 టికెట్ల ధరలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇక ట్రెయిన్‌లో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్‌మెంట్స్ ఎలా అయితే ఉంటాయో థియేటర్‌లోని బాల్కనీ, ప్రీమియమ్ సెక్షన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. అందువల్ల సినిమా టికెట్ల ధరలు పెంచాలని హీరో నిఖిల్ ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.