- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హీరో మోటోకార్ప్ కీలక ఒప్పందం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రాణించేందుకు గొగొరొ ఇంక్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు బుధవారం వెల్లడించింది. ఇరు కంపెనీల ఒప్పందం ప్రకారం.. గొగొరొ కంపెనీకి చెందిన ప్రముఖ బ్యాటరీ సాంకేతికతను భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు కంపెనీలు జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. తద్వారా హీరో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి గొగొరొ సంస్థ సహాయంగా ఉండనున్నట్టు హీరో కంపెనీ తెలిపింది. ‘ఈ భాగస్వామ్యం కంపెనీ ప్రయాణంలో ప్రధాన మైలురాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో సంస్థ లీడర్‌గా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో గొగొరొ కంపెనీతో భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఇన్నోవేషన్ పవర్‌హౌస్ ఏర్పాటుకు, వ్యాపారా నమూనాను మెరుగుపరిచేందుకు వీలవుతుందని’ హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈఓ పవర్ ముంజల్ ఓ ప్రకటనలో చెప్పారు. ఇరు సంస్థల లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ అభివృద్ధికి అవకాశం ఉంటుందని పవర్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా మొదట భారత్‌లో, అనంతరం ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో స్థిరమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్త్రణకు కట్టుబడి ఉన్నాము. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల బలోపేతానికి దోహదపడుతుంది. భవిష్యత్తులో దీన్ని వేగవంతం చేస్తుందని పవన్ పేర్కొన్నారు. ‘తమ భాగస్వామ్యం భారత్‌లోని ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఉన్న సవాళ్లను పరిష్కరిస్తుందని గొగొరొ ఇంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ హొరెస్ లూక్ చెప్పారు.