38 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ లాభాలు!

by Harish |
Hero MotoCorp
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ నికర లాభం 38 శాతం పెరిగి రూ. 865 కోట్లుగా వెల్లడించింది. దేశీయంగా గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లలో మొటార్‌సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు మెరుగుపడటంతో లాభాలు పెరిగాయని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 39 శాతం వృద్ధితో రూ. 8,686 కోట్లకు పెరిగినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘గతేడాది రెండో సగంలో కంపెనీ అమ్మకాలు కోలుకోవడంతో బలమైన వృద్ధిని సాధించాం. అయితే, ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ కారణంగా పరిశ్రమ మళ్లీ దెబ్బతింటోందని’ హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్ చెప్పారు. ఇక, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ. 25 తుది డివిడెండ్‌కు ఆమోదం తెలిపింది. అలాగే, ప్రతి షేర్‌కు అదనంగా రూ. 10 ప్రత్యేక డివిడెండ్‌ను ఆమోదించింది.

Advertisement

Next Story

Most Viewed