- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త రికార్డును సాధించింది. 30 ఏళ్ల నుంచి వాహన తయారీలో ఉన్న కంపెనీ ఇప్పటివరకు 10 కోట్ల వాహనాలను తయారుచేసినట్టు వెల్లడించింది. తాజాగా హరిద్వార్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ మోడల్‌ను ఉత్పత్తి చేయడంతో ఈ రికార్డును సాధించింది. ఈ క్రమంలో కంపెనీ రానున్న ఐదేళ్లలో ప్రతి సంవత్సరం 10 కొత్త వాహనాలను తీసుకురావాలని లక్ష్యంగా ఉన్నట్టు తెలిపింది. మొదటిసారిగా 1984లో హీరో మోటోకార్ప్ తన ఉత్పత్తిని ప్రారంభించగా, 1994లో తన 10 లక్షల వాహనాల ఉత్పత్తిని సాధించింది. అనంతరం 2013లో 5 కోట్ల వాహనాలు, 2017లో ఏడున్నర కోట్ల వాహనాల ఉత్పత్తి రికార్డును సాధించింది. ‘కంపెనీ మూడు దశాబ్దాల కష్టానికి ప్రతిఫలం ఈ రికార్డు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తమ వాహనాలకు డిమాండ్ ఉందని, దాదాపు 40 దేశాల్లో కంపెనీ వాహనాలను విక్రయిస్తున్నట్టు’ హీరో మోటోకార్ప్ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజల్ చెప్పారు.