కెంట్ యాడ్ పై నెటిజన్ల ఫైర్.. క్లారిటీ ఇచ్చిన డ్రీమ్ గర్ల్

by Shyam |
కెంట్ యాడ్ పై నెటిజన్ల ఫైర్.. క్లారిటీ ఇచ్చిన డ్రీమ్ గర్ల్
X

డ్రీమ్ గర్ల్ హేమమాలిని అందం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మనవరాళ్లు, మనవలు వచ్చినా సరే.. ఆ అందం అలాగే ఉంది. దీంతో తమ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉండాలంటూ చాలా కంపెనీలు ఇప్పటికీ తనను సంప్రదిస్తున్నాయి. అయితే ఇప్పటికే కెంట్ వాటర్ ప్యురిఫైర్ యాడ్ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ.. ఈ కంపెనీ చేసిన పనికి తల పట్టుకుంటుంది. నెటిజన్ల విమర్శలతో సతమతం అవుతోంది.

విషయం ఏంటంటే.. కెంట్ సంస్థ ఈ మధ్య చపాతీ, బ్రెడ్ మేకింగ్ వీడియోల పై యాడ్ విడుదల చేసింది. ఇందులో కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితుల్లో మీ ఇంట్లో పని మనిషి చేతికి క్రిములు ఉంటే చాలా ప్రాబ్లం.. కాబట్టి మీరే చపాతీ, బ్రెడ్ మేకింగ్ మిషన్ పై స్వయంగా తయారు చేసుకోండి అనేది యాడ్ సారాంశం. ఈ యాడ్ లో పని మనుషులను తక్కువ చేస్తూ .. వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ .. ఆ కంపెనీ అంబాసిడర్ అయిన హేమ మాలినిపై విమర్శల వర్షం కురిపించారు నెటిజన్లు.

దీంతో దీనిపై వివరణ ఇచ్చింది డ్రీమ్ గర్ల్. ఆ యాడ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అడ్వర్టైజ్మెంట్ లో ఉన్న భావాలు తన విలువలను ప్రతింబింభించవని తేల్చి చెప్పింది. సమాజంలో ప్రతీ వర్గాన్ని నేను గౌరవిస్తాను అని.. ఇప్పటికైనా తనపై విమర్శలు మానుకోవాలని కోరింది. కాగా దీనిపై ఇప్పటికే క్షమాపణలు చెప్పారు కెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ గుప్తా.

Advertisement

Next Story