అనాథ మహిళకు సాయం.. గొప్ప మనస్సును చాటుకున్న ముగ్గురు వ్యక్తులు

by Sridhar Babu |   ( Updated:2021-12-11 04:38:28.0  )
అనాథ మహిళకు సాయం.. గొప్ప మనస్సును చాటుకున్న ముగ్గురు వ్యక్తులు
X

దిశ, మణుగూరు: తినడానికి తిండి.. ఉండటానికి ఇల్లు లేని అనాధ మహిళను, ఇద్దరు చంటి పిల్లలను మనస్సు ఉన్న ముగ్గురు మహారాజులు ఆదుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చెరువుకట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… తన భర్త చనిపోవడంతో బాడిశ ధనలక్ష్మి అనే మహిళ అనాధ మహిళగా మారింది. ధనలక్ష్మికి ఇద్దరు చంటి పిల్లలున్నారు. ధనలక్ష్మి, ఇద్దరు చంటి పిల్లలకు తినడానికి తిండిలేదు…ఉండటానికి ఇల్లు లేదు. వీరికి అన్నం పెట్టేవారే కరువయ్యారు.

ఇద్దరు చంటి పిల్లల పొట్టనింపడం కోసం ధనలక్ష్మి పగలు..రాత్రులు భిక్షాటన చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ధనలక్ష్మి విషయం తెలుసుకున్న మణుగూరు పట్టణానికి చెందిన మనస్సున్న ముగ్గురు మహారాజులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ ఆవుల నరసింహారావు, నూకారపు రమేష్ కలసి ధనలక్ష్మికి 50000 వేల రూపాయలు ఖర్చుపెట్టి ఉండటానికి నివాసాన్ని ఏర్పాటు చేశారు. కట్టుకోవడానికి దుస్తులను అందజేశారు. ఈ ముగ్గురు చేసిన పనిని చూసి మండల ప్రజలు, పలువురు నాయకులు అభినందించారు.

Advertisement

Next Story