జూరాల ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద..

by Shyam |   ( Updated:2021-06-11 22:32:33.0  )
జూరాల ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద..
X

దిశ, వెబ్‌డెస్క్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద పెరుగుతోంది. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కారణంగా నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద పెరిగింది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.888 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 13,200 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 20,075 క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుండి శ్రీశైలంలోకి 16,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయానికి కూడా నీటి వరద పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 21,241 క్యూసెక్కులు ఉంది. ఇప్పటికైతే ఔట్‌ఫ్లోను విడుదల చేయలేదు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 810.90 అడుగుల మేర నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 34.8332 టీఎంసీలు ఉంది. అయితే కుడి, ఎడమ గట్టు జల విద్యత్ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్రారంభించలేదు.

Advertisement

Next Story

Most Viewed