- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
by Shyam |
X
దిశ, నిజామాబాద్ :
కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం కురిసింది. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూర్, బీబీపేట్ మండలాల్లో 40 నిమిషాల పాటు ఏకధాటిగా రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నీటి పాలు కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షంతో కామారెడ్డి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏప్రిల్ చివరి వారంలో కురిసిన అకాల వర్షానికి 540 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు చేతికి వచ్చిన పంటను నష్టపోతున్నారు.
Advertisement
Next Story