తెలంగాణకు తుఫాన్ హెచ్చరిక.. ప్రజలు జర భద్రం

by Anukaran |   ( Updated:2021-09-26 08:15:45.0  )
rainfall
X

దిశ, వెబ్‌డెస్క్ : తుఫాన్ హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణా జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షణ తెలంగాణా జిల్లాలకు ఆరెంజ్ అల్లర్ట్ గా ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీస్ ఇతర లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాలపట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు, తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed