- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో రెండ్రోజులు భారీ వర్ష సూచన
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మూడు జిల్లాలో అతిభారీ వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో 19.4 సెంటిమీటర్లు, సిద్దిపేట జిల్లా తొగుటలో 12.5 సెంటి మీటర్లు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సగటు వర్షపాతం 11.1 సెంటిమీటర్లు పడింది. కామారెడ్డిలో 10.8 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 10.6 సెంటిమీటర్లు కురిసింది. రాష్ట్రంలో 15జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. పది జిల్లాలో సాధారణ వర్షపాతంగా ఉంది. కేవలం నిర్మల్ జిల్లాలో మాత్రమే తక్కువ వర్షం కురిసింది. ఇక వచ్చే రెండ్రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
గ్రేటర్లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్ నగరంలో బుధవారం పలు భారీ చోట్ల వర్షపాతం నమోదయింది. బాలానగర్‌లో 7.6 మిమీ, ఫిరోజ్‌గూడలో 6.7 మిమీ, బేగంపేటలో 5 మిమీ, కూకట్‌పల్లిలో 4.9మిమీ, చార్మినార్, సికింద్రాబాద్, అమీర్‌పేట, ఖైరతాబాద్ ఏరియాల్లో 3మిమీలకు పైగా వర్షపాతం నమోదయింది. నాంపల్లి, బండ్లగూడ, వెస్ట్ మారేడ్‌పల్లి, ఆసిఫ్‌నగర్ , మల్కాజ్‌గిరిల్లో 2.5మిమీ వర్షపాతం నమోదయింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.