గాంధీ జయంతి రోజున భారీగా మద్యం పట్టివేత

by Sumithra |
గాంధీ జయంతి రోజున భారీగా మద్యం పట్టివేత
X

దిశ, తొర్రూరు : గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలు నిషేధితమైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో శనివారం తొర్రూరు సీఐ కర్ణాకర్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి భారీగా మద్యం సీజ్ చేశారు. తొర్రూరు ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని గొల్లబజార్ లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ తనిఖీల్లో పెద్ది సంతోష్ ఇంట్లో సుమారు రూ 30 వేల నుండి 50 వేల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో తొర్రూరు సర్కిల్ పరిధిలోని పెద్దవంగర ఎస్సై రియాజ్, నర్హింహులపేట ఎస్సై నరేష్, దంతాలపల్లి ఎస్సై మురళి తోపాటు తొర్రూరు అదనపు ఎస్ఐ రాంజీ నాయక్, ఏఎస్ఐ హరి శంకర్, పోలీస్ సిబ్బంది సారయ్య, తిరుమలేష్, ప్రకాష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed