- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12,300 ఏళ్ల క్రితమే పొగాకు వినియోగం
దిశ, ఫీచర్స్: ఉటాలోని గ్రేట్ సాల్ట్ లేక్ ఎడారిలో.. ఉత్తర అమెరికా అంతర్భాగంలోని పూర్వ నివాసులు నిర్మించిన పొయ్యి అవశేషాలకు సంబంధించిన సాక్ష్యాలను కనుగొన్నారు. ఇవి మానవ సంస్కృతికి మైలురాయి వంటివి కాగా.. రాతి పనిముట్లు, బాతు ఎముకలతోపాటు పొయ్యిలోని నాలుగు అడవి పొగాకు మొక్కల విత్తనాలను పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకు పొగాకు సంబంధించిన మొట్టమొదటి డాక్యుమెంట్ ఉపయోగం.. నికోటిన్ అవశేషాల రూపంలో అలబామాలో లభించింది. అది 3,300 సంవత్సరాల క్రితం నాటి ధూమపాన పైపులో లభించగా, ప్రస్తుతం ఉటాలో దొరికిన పొగాకు విత్తనాలు 12,300 సంవత్సరాల క్రితం నాటినవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఉటా ప్రాంతంలోని సంచార వేటగాళ్లు ధూమపానం చేసి ఉండొచ్చు లేదా నికోటిన్ అందించే ఉద్దీపన కోసం పొగాకు మొక్కల ఫైబర్‌ను పీల్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐదు శతాబ్దాల క్రితం యూరోపియన్లు వచ్చిన తరువాత పొగాకు ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందగా, నాటి నుంచి క్రమక్రమంగా దాని వ్యాపారం విస్తరించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1.3 బిలియన్ పొగాకు వినియోగదారులుండగా, ఏటా 8 మిలియన్లకు పైగా పొగాకు సంబంధిత అనారోగ్యాల వల్ల చనిపోతున్నారు.
‘ప్రపంచ స్థాయిలో పొగాకును మత్తు మొక్కలకు రాజుగా అభివర్ణించవచ్చు. అది ఇటీవల కాలంలో వచ్చింది కాదు, దాని మూలాలు మంచు యుగం నాటివిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉటాలోని పొయ్యిలో లభించిన పొగాకు విత్తనాలు అనేక రకాల ఎడారి పొగాకు(డిజర్ట్ టోబాకో)కు చెందినవి, వీటిని ‘నికోటియానా అటెనువాటా’ అని పిలుస్తారు. ఈ జాతిని ఇప్పటివరకు ఎవరూ పెంచలేదు. కానీ ఈ ప్రాంతంలోని స్థానిక ప్రజలు ఈ పొగాకునే ఉపయోగిస్తుండగా.. వేలాది సంవత్సరాల తర్వాత ఖండంలోని ఇతర ప్రాంతాలలో నైరుతి, ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్ సహా మెక్సికోకు విస్తరించింది. పొగాకు పెంపకం ఎప్పుడు మొదలైందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేం కానీ, కొంతమంది మాత్రం ఉత్తర అమెరికాలో పెంచిన మొదటి మొక్క పొగాకు అని వాదించారు. అయితే వ్యవసాయంపై పెట్టుబడులు పెట్టే జనాభా.. పొగాకును మించి ఆహారానికి అవసరమైన పంటలు పండించి ఉండొచ్చు. ఇక పొగాకుతో పాటు పెద్ద క్షీరదాలను వేటాడేందుకు ఉపయోగించే అబ్సిడియన్ అనే అగ్నిపర్వత గాజుతో తయారు చేసిన చిన్న పదునైన రాతి కోత సాధనాలు, ఈటలు లభించాయి. అయితే అందులోని ఒక ఈట కొసపై మమ్మూత్(అంతరించిపోయిన ఏనుగు జాతి)లేదా మాస్టోడాన్‌కు చెందిన రక్త ప్రోటీన్ల అవశేషాలు ఉన్నాయి.
– డారన్ డ్యూక్, ఆంత్రోపాలజికల్ రీసెర్చ్ పురావస్తు శాస్త్రవేత్త