- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మర్‌లో ఆస్తమా పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్ : సమ్మర్ వచ్చిందంటే చాలు, చాలా మంది అనారోగ్య సమస్యల భారిన పడుతుంటారు. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ ఈ వేసవిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా పేషంట్స్ అనారోగ్యం భారిన పడక తప్పదంట. కాగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎయిర్ పొల్యూషన్‌కు ఆస్తమా పేషెంట్స్ దూరంగా ఉండాలి. గాలి కాలుష్యం వలన ఊపిరితిత్తుల్లో సమస్యలు కలుగవచ్చు. దుమ్ము మొదలైన కారణాలు వలన కూడా గాలి యొక్క నాణ్యత తగ్గుతుంది. ఇది ఆస్తమాని కలిగించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలంట.
అలాగే వేసవికాలంలో హ్యుమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అటువంటప్పుడు ఆస్తమా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంపై కూడా శ్రద్ధ వహించండి. ఎలర్జీల వలన కూడా ఆస్తమా రావచ్చు. అందు వలన ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇవి కూడా చదవండి: సమ్మర్‌లో మైగ్రేన్ ఎందుకు తీవ్రమవుతుందో తెలుసా?