Biryani : బిర్యానీ అతిగా తింటున్నారా? మీ కోసమే ఈ సమాచారం!

by Jakkula Samataha |
Biryani : బిర్యానీ అతిగా తింటున్నారా? మీ కోసమే ఈ సమాచారం!
X

దిశ, ఫీచర్స్ : బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ చాలా మందికి ఫేవరెట్. ఇక ఆదివారం వచ్చినా, లేదా పార్టీలు, బర్త్ డేస్‌కు చాలా మంది స్నేహితులో కలిసి బిర్యానీ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకొందరు ఇంటిలోనే బిర్యానీ వండుకొని మూడు పూటలా సంతోషంగా తింటారు.

అయితే బిర్యాని అతిగా తింటారు. కానీ అసలు ఇలా బిర్యానీని ఎక్కువగా తినడం వలన ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అని ఎవరూ ఆలోచించరు. కాగా దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా బిర్యానీ తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

బిర్యానీ అతిగా తినడం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిర్యానీలో వాడే మసాలా కారణంగా జీర్ణ సమస్యలు, అల్సర్ వంటి సమస్యలు ఎదురు అవుతుంటాయంట. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, అధికంగా బరువు పెరుగుతారు. అంతే కాకుండా గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని,అందువలన బిర్యానీలు బయటనే కాకుండా, ఇంట్లో కూడా వండుకొని తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

Next Story