- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీర్య కణాల నాణ్యతను పెంచుకోండి ఇలా...
దిశ, వెబ్డెస్క్ : నేటి జీవన విధానం మనిషి శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. ఇందులో ప్రధానంగా పురుషుల వీర్య కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో సంతానోత్పత్తి ప్రతికూలంగా ఏర్పడి వైద్యుల వద్దకు వెళ్లాల్సి వచ్చి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు మన పూర్వికులు పౌష్టికాహారం తీసుకోవడంతో గంపెడుమంది పిల్లలకు జన్మనిచ్చారు. కానీ నేడు ఒక్కరిని కనడానికి నానాతంటాలు పడాల్సి వస్తుంది. అందుకు మంచి ఆహారం తీసుకుంటే సంతానలేమి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇందుకు పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. గింజలు ఎక్కువగా తినాలి. ప్రధానంగా పలు రకాల గింజలు తినడం వల్ల వీర్య కణాల వృద్ధి వేగంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పాలీఫెనాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలలో ప్రతి ఒక్కటి వివిధ మార్గాల్లో పురుషుల సంతానోత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే వాల్‌నట్‌లు పురుషులలో స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఈమేరకు మోనాష్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం కూడా తేల్చింది.