సమ్మర్‌లో కాఫీ అతిగా తాగుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు

by samatah |   ( Updated:2023-04-20 04:31:04.0  )
సమ్మర్‌లో కాఫీ అతిగా తాగుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు
X

దిశ, వెబ్‌డెస్క్ : కాఫీని చాలా మంది ఇష్టంగా తాగుతారు. కానీ సమ్మర్‌లో కాఫీ అతిగా తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఉందంట. అందువలన కాఫీని అస్సలే అతిగా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు. కాఫీని అతిగా తీసుకోవడం వలన కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కాఫీ ని అతిగా తీసుకుంటే నిద్రలేమి సమస్య, అజీర్తీ వంటి సమస్యలు వస్తాయంట.అలాగే హై బీపీ, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి కూడా కాఫీ అతిగా తాగడం వలన వస్తాయని వైద్యులు చెప్తున్నారు. నిద్రలేమి సమస్యతో పాటు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందువలన కాఫీని అతిగా తీసుకోకూడదని, ముఖ్యంగా సమ్మర్ సీజన్‌‌లో అస్సలే తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story