- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శుక్రకణాల సంఖ్య పెరగాలంటే ఇవి తినండి..
దిశ, వెబ్ డెస్క్: ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా కీలక ఘట్టం. పెళ్లి అయిన తరువాత పిల్లలు పుట్టాలని కోరుకోని వాళ్లు ఎవరైనా ఉంటారా..? ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా పిల్లలు పుట్టకపోతే జీవితం అసంతృప్తిగానే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో బిజీ జీవితంలో ఆహారపు అలవాట్ల విషయంలో గానీ, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో అది కాస్త లైంగిక సమస్యలకు దారి తీస్తోంది. ఇటీవల కాలంలో చాలా మంది సంతాన లేమి సమస్యతో భాధపడుతున్నారు.
పురుషుల్లో సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం. ఉన్నవాటిలో కూడా శుక్ర కణాలు నాణ్యత లేని కారణంగా చాలా మంది పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా శుక్ర కణాలు సంఖ్యను పెంచుకోవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు: గుమ్మడి గింజల్లో జింక్ ఉంటుంది, ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
నారింజ: విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజ్‌లు స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
డార్క్ చాక్లెట్: స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యతను పెంచుకోవడానికి, డార్క్ చాక్లెట్ తినండి. ఇందులో అర్జినైన్ అనే మూలకం ఉంటుంది, ఇది స్పెర్మ్ కౌంట్‌నుపెంచుతుంది.
దానిమ్మ రసం: యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న దానిమ్మ రసం టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది, ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెరిగేలా చేస్తుంది.
సాల్మన్ చేప: సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, ఇవి స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతాయి.