Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు ఎందుకొస్తాయో.. తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-01-04 06:09:42.0  )
Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు ఎందుకొస్తాయో.. తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో మనలో చాలా మందిని బాధించే సమస్య కిడ్నీలో రాళ్లు. పని ఒత్తిడిలో చాలా మంది నీరును తీసుకోకుండా ఉంటారు. ఇలాంటి వారికి కిడ్నీ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందట. ప్రతి రోజు కనీసం 4 లీటర్లు నీళ్లను తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో వ్యర్థం బయటికి పోతాయి. మన శరీరానికి సరయిన నీరు తీసుకోకపోతే కిడ్నీల్లో రాళ్లు పడే అవకాశం ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఎందుకొస్తాయంటే..తక్కువ నీరు త్రాగే వారిలో కిడ్నీలో రాళ్లు తొందరగా బయట వేస్తాయి. ఈ రాళ్లు మూత్రపిండాల్లో ఉండి.. మనిషిని బాగా ఇబ్బంది పెడతాయి. కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడే వారికి.. మూత్రవిసర్జనలో సమస్యలు కూడా వస్తాయి. ఈ రాళ్లు చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏం కాదు. పెద్దవి అయ్యే కొద్దీ తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. అంతే కాకుండా నడుమ కింద కూడా భరించ లేని నొప్పి వస్తుంది. కాబట్టి నీటిని శరీరానికి సరిపడనంత తీసుకోండి.

Read more:

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించండి

Advertisement

Next Story