- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వర్షాకాలంలో కలవర పెట్టే కామెర్లు.. అరటి పండు అంత ప్రమాదమా..?
దిశ, వెబ్‌డెస్క్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు భూగర్భజలాలు, నదులు, సరస్సులు నిండుకుండలా మారతాయి. అలాగే వాతావణం కూడా చల్లగా ఉంటుంది. ఈ సీజన్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అన్ని వ్యాధులను కూడా తీసుకువస్తుంది. అందుకే ఈ సీజన్ మొదలయ్యిందంటే పరిసర ప్రాంతాలన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదా అనారోగ్యం బారిన పడడం ఖాయం. తీసుకునే ఆహారం విషయంలో, అలాగే తాగే నీళ్ల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వర్షాల కారణంగా కొత్తనీళ్లు తాగడం వలన వైరల్ ఫీవర్‌తో పాటు దగ్గు, జలుబు వంటివి కూడా అటాక్ కావొచ్చు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో కామెర్ల వ్యాధి సంభవిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకినవారి బరువు రోజురోజుకు తగ్గుతుంది. శరీరం పసుపురంగులోకి మారుతుంది. అలాగే వారి కళ్లు పసుపురంగులోకి మారుతాయి. అంతే కాదు ఈ వ్యాధి కారణంగా రక్తంలోకి బిలిరుబిన్ విడుదలవుతుంది. అయితే ఈ వ్యాధి సోకినవారు కొన్ని ఆహార పదార్ధాలను దూరం పెట్టాలి. లేదంటే ప్రాణాపాయం సంభవిస్తుంది. మరి కామెర్లు వచ్చిన వారు ఏయే ఆహారాన్ని దూరం పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం
అరటిపండ్లు తినవద్దు..
కామెర్ల వ్యాధి సోకినప్పుడు ఆ వ్యక్తి అరటిపండును అస్సలు తినకూడదు. అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ ప్రక్రియ క్షీణిస్తుంది. అంతే కాదు అరటిపండు తినడం కారణంగా రోగి శరీరంలో బిలిరుబిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది. అందుకే కామెర్లు వచ్చిన వారు తమకు హాని కలిగించని ఫలాలను తినాలి.
టీ, కాఫీలకు దూరం..
మనం నిత్యం తాగే కాఫీ, టీలో కెఫిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఈ కెఫిన్ కామెర్లో సోకిన వ్యక్తి ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తుంది. దూరం పెట్టడం ఆరోగ్యానికి మంచిది.
నూనె, మసాలాలు, జిడ్డు ఆహారాలు..
కామెర్లు సోకిన వ్యకి ఆయిల్ ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. జిడ్డు, వేయించిన, స్పైసీ ఫుడ్‌ను అస్సలు తినకూడదు. నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే అది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమయంలో అలాంటి డైట్ కంటే త్వరగా అరిగే లైట్ ఫుడ్ తీసుకుంటే రోగి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పంచదార తగ్గించాలి..
కామెర్లు వచ్చిన వ్యక్తి చక్కెరని తగ్గించాలి. చెక్కరను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చెడ్డ కొవ్వు పేరుకుపోతుంది. అలాగే ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనే పదార్థం రిఫైన్డ్ షుగర్‌లో ఎక్కవు మొత్తంలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల రోగి కాలేయం దెబ్బతింటుంది.
మద్యం సేవించడం తగ్గించాలి..
కామెర్లు ఉన్న వ్యక్తికి మద్యం అలవాటు ఉంటే ఖచ్చితంగా మానేయాలి. దీని ద్వారా కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా పాడయిపోయి రోగిని కోలుకోనివ్వకుండా చేస్తుంది.
Read More: భయపడుతున్న లవర్స్.. ఆ పని చేయాలా.. వద్దా..? పాస్ట్ రిలేషన్స్ గాయాలే కారణమా..?