థైరాయిడ్ ఉన్న వారు మధ్యలో మెడిసన్ తీసుకోవడం మానేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే!

by Jakkula Samataha |
థైరాయిడ్ ఉన్న వారు మధ్యలో మెడిసన్ తీసుకోవడం మానేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న అతి పెద్ద సమస్య థైరాయిడ్. ఇది దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉంటుంది. దీని వలన ఆడవారు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హర్మోన్ ప్రభావం శరీరంలోని ప్రతి అవయం మీద దీని ప్రభావం చూపిస్తుంటుంది. ఇక ఈ హార్మోన్ ఉత్పత్తి పెరిగితే హైపర్ అని, తగ్గితే హైపో థైరాయిడ్ అని అంటుంటారు.

హైపర్ థైరాయిడ్ లక్షణాలు :

ఆకలి ఎక్కువ అవ్వడం

బరువు తగ్గడం

చెమటలు ఎక్కువ పట్టడం

చిరాకు

స్థిమితం లేకపోవడం

నిద్ర లేమి

నీరసం

ఎక్కువసార్లు విరేచనం అవ్వడం

నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం

వేడిని తట్టుకోలేక పోవడం

గొంతు ముందు వాపు

గుండె దడ అనిపించడం

కళ్ళు పెద్దవిగా అవ్వడం

చేతులు వణకడం

హైపో థైరాయిడ్ లక్షణాలు :

బలహీనంగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తుంది

కండరాలు మరియు కీళ్ల నొప్పులు

బరువు పెరుగుట

చలికి సున్నితత్వం

పొడి బారిన చర్మం

అయితే వీటిలో ఏ లక్షణాలు ఉన్న థైరాయిడ్ ఉన్నట్లే. ఇక ఈ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ తప్పనిసరిగా మెడిసన్ తీసుకోవాల్సిందే. అయితే కొంత మంది మెడిసన్ తీసుకొని మధ్యలో మానేస్తుంటారు. అయితే అలా అస్సలే చేయకూడదంట. దీని వలన చాలా సమస్యలు ఎదురవుతాయంట. అయితే థైరాయిడ్ ట్యాబ్ లేట్స్ ఒటి లేదా రెండు రోజులు మానేయడం వలన దాని ప్రభావం, లక్షణాలు అంతగా కనిపించవంట. కానీ , చాలా రోజులు లేదా సంవత్సరం పాటు మెడిసన్ వాడకపోతే థైరాయిడ్ అనేది తీవ్రతరం అవుతుందంట. దీని వలన రక్తప్రసరణ సరిగా ఉండకపోవడం, గుండె వైఫల్యం, గుండె సమస్యలు వచ్చి ఒక్కోసారి ఇది ప్రాణాతకం కూడా కావచ్చునంట. అందువలన అస్సలే మెడిసన్ స్కిప్ చేయకూడదు అంటన్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed