- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భిణీ స్త్రీ ఇలా చేస్తే శిశువుకు వైకల్యం తప్పదు.. బిడ్డ అందంగా పుట్టాలంటే..?
దిశ వెబ్ డెస్క్: మాతృత్వం అనేది స్త్రీకి ఓ గొప్ప వరం. అదృష్టం ఉంటేనేగాని అమ్మ కాలేరు అంటారు పెద్దలు. నేటీకీ ఎంతోమంది సంతానం లేక బాధపడుతున్నారు. కొందరు ఒక్క బిడ్డ పుడితే చాలని, తిరగని గుడి ఉండదు, కలవని డాక్టర్ ఉండరు. అయినా ఫలితం ఉండదు. కానీ బిడ్డలు లేక కొందరు బాధపడుతుంటే, మరికొందరు తలుపుతట్టిన అదృష్టాన్ని నిర్లక్ష్యంతో కాలరాసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. స్త్రీ గర్భం దాల్చిన తరువాత చాల జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భంతో ఉన్న స్త్రీలు ఎట్టిపరిస్థితిలోనూ ఒత్తిడికి గురికాకూడదని తాజాగా లండన్ లోని యూసీఎల్ వర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో తేలింది. తల్లి ఒత్తిడికి గురైతే, ఆ ఒత్తిడి ప్రభావం గర్భసంచిపై పడుతుందని తెలిపింది.
దీని కారణంగా గర్భసంచిలో అతి సున్నితంగా పెరుగుతున్న గర్భస్థ శిశువు రూపురేఖలు మారిపోతాయని, ఒత్తిడి మరీ ఎక్కువైతే శిశువుకు వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.